State politics news{nellore}:
నెల్లూరు వైసీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి, అనిల్ అన్న సేవాసమితి జిల్లా అధ్యక్షుడు అద్దంకి జగన్ యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం నెల్లూరు నగరంలోని 9వడివిజన్ చిన్న బాలయ్య నగర్ ప్రత్తి వారి ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సమక్షంలో మంత్రి అనిల్ జన్మదిన వేడుకలును అంగరంగ వైభవంగా చేపట్టారు.ఈ సందర్భంగా విద్యార్థులుకు కేకు లు పంచి వారి బంగారు భవిష్యత్తు కు మంత్రి అనిల్ కుమార్ సేవాసమితి ముందుంటుందని అద్దంకి జగన్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్,10వ డివిజన్ ఇంఛార్జ్ ఉప్పల్ శేషు గౌడ్,సీనియర్ నేత ఉమామహేశ్వరరావు లు పాల్గొన్నారు.వారికి విద్యార్థులు చే పుష్పగుచ్ఛంలు అందజేసారు.విద్యార్థులు అందరూ హ్యాపీ బర్త్ డే అనిల్ కుమార్ సర్ అంటూ నినాదాలు చేసారు.ఆ పాఠశాల ఆవరణమంత మంత్రి అనిల్ కుమార్ పేరు మార్మోగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాస్మిన్,ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు,వైసీపీ సీనియర్ నేత తిప్పి రెడ్డి రఘురామిరెడ్డి,కార్యకర్తలు లక్ష్మీ నారాయణ, హరీష్ యాదవ్,యాకుబ్, శ్రీనివాసులు, చిన్నారావు, దశయ్య తదితరులు పాల్గొన్నారు.