"లా" విద్యార్థులకు న్యాయం చేయండి-అరవ పూర్ణ

 


State politics news{nellore}:

 వి ఆర్ సి లా కాలేజీ లోనే బిసి, ఎస్ టి, ఎస్ సి విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఫీజు  రీయింబర్స్ మెంట్ పై ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ దళిత సేన రాష్ట్ర కార్యదర్శి అరవ పూర్ణ ప్రకాష్ జేసి హరింద్ర ప్రసాద్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లా కాలేజ్ ప్రిన్సిపల్ జయచంద్రపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లా విద్యార్థులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.