ఆత్మకూరు మునిసిపాలిటీ ఛైర్మన్ గా వాలంటీర్




 State politics news{nellore}:

  వాలంటీరుగా నిస్వార్థ సేవలు అందించిన గోపవరం వెంకటరమణమ్మను ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసి  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.నెల్లూరు నగరంలోని మంత్రి మేకపాటి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆత్మకూరు మునిసిపల్ కౌన్సిలర్ లు మంత్రి ని కలిసారు.ఈ సందర్భంగా మంత్రి వాలంటీర్ రమణమ్మ ని మునిసిపల్ చైర్మన్ గా ఎంపిక చేయడంతో అందరూ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన ఛైర్మన్ వెంకట రమణమ్మ మంత్రిమేకపాటి కి పుష్ప గుచ్ఛం అందజేసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ ఎంపికలో మేక్ మంత్రి గా మేకపాటి గౌతమ్ రెడ్డి  ఒక ఆదర్శవంతమైన స్ఫూర్తిదాయకమైన నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఒక వాలంటరీకి ఛైర్మన్ గిరి వరించడంతో ఆత్మకూరు నియోజకవర్గ వాలంటీర్ల కూడా మంత్రి ఎంపికపై ఆనందాన్ని వ్యక్తం చేశారు.