జగన్‌ జనరంజక పాలన ప్రభంజనమే -ఫ్యాన్‌ సునామీ

 


State politics news {Kavali}: 

 నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ సంబరాలు నిర్వహించారు.

రాష్ట్రంలో కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజకమైన పరిపాలన అందిస్తూ భావితరాలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేలా సంక్షేమ, అభివృద్ధి లకు సారధిగా వ్యవహరిస్తున్నందువల్లనే 

రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్, మున్సిపాల్టీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఫ్యాన్‌ సునామీ విజయదుంధుభి మోగించిందని  కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.కావలిలో ఆదివారం వైఎస్సార్‌సీపీ విజయోత్సవ సంబరాలు భారీ ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .ఎంచంద్రబాబు నాయుడు, ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియాలు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని విష ప్రచారాలు చేసినా, రాష్ట్ర ప్రజలు నమ్మలేదని అన్నారు. నిజాయితీ, విశ్వసనీయతలనే ప్రాతిపదికగా చేసుకొని పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల అపారమైన ఆత్మీయతతో కూడిన  అభిమానంతో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్‌సీపీ కి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించారని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలకు పాచి పని చేసుకోవడానికి వెళ్తున్నారని, సిగ్గులేదా, రోషం లేదా అంటూ చంద్రబాబు నాయుడు అహంకారంగా మాట్లాడిన మాటలకు రాష్ట్ర ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ సంపూర్ణంగా తుడిచిపెట్టుకొని పోయిందని, వైఎస్సార్‌సీపీ  నాయకులు, కార్యకర్తలు భాధ్యతతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు అందేలా శ్రద్ధ తీసుకోవాలని కోరారు.కాగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసం నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కూడా బైక్‌ నడిపి పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. బైక్‌ ర్యాలీ పట్టణంలోని ఉదగయగిరి బ్రిడ్జి సెంటర్‌ వరకు కొనసాగింది. అక్కడ పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు. అలాగే నేలపై, ఆకాశంలో రంగుల హరివిల్లులు, రంగుల దీపాలతో కూడిన బాణా సంచా స్థానికులను ఆకట్టుకొంది. అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి  భారీ కేక్‌ ను కట్‌ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తినిపించారు.