State politics news{nellore}:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు యువజన విభాగం అధ్యక్షులు రూప్ కుమార్ యాదవ్ , మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ సహాయ సహకారాలతో 7వ డివిజన్ వైఎస్సార్సీపీ ఇంఛార్జి కిన్నెర మాల్యాద్రి ఆధ్వర్యంలో 7వ డివిజన్ నందు కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టారు. సోమవారం 7వ డివిజన్ స్థానిక వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం లో 60 సంవత్సరాలు పైబడిన వారికి, 45 సంవత్సరాలు నిండి ఉండి షుగరు ,బీపీ కలిగి ఉన్న వారికి ఉచితంగా ప్రభుత్వ సహకారంతో కోవిడ్ వాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యువనేత సాగర్ కార్యకర్తలు సందీప్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.