15వ డివిజన్ ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతాం:ఇంఛార్జ్ గణేశం

 


State politics news {Nellore}:

 స్వచ్ఛ సర్వేక్షన్ 2021 లో భాగంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలతో నెల్లూరు  నగరం స్వచ్ఛ సర్వేక్షన్ 2021 పోటీలో ముందంజలో ఉండే దానిలో భాగంగా 15 డివిజన్ ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని  వైఎస్సార్సీపీ డివిజన్ ఇంచార్జ్  గణేశం  వెంకటేశ్వర్లు రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ ఇంఛార్జ్ గణేశం వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వార్డు శానిటేషన్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు ద్వారా స్వచ్ఛ సర్వేక్షన్ పోస్టర్లను ప్రారంభించి,మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా బహిరంగంగా మలమూత్ర విసర్జనను నిర్మూలిద్దాం, మరుగుదొడ్లను వాడదాం, చెత్తను రోడ్లమీద వెయ్యకుండా చెత్త బుట్టలోనే  వేద్దాం,  రోడ్లను బాగు చేసుకుందాం, ప్లాస్టిక్ వాడకాన్ని నిలుపుదల చేద్దాం, ఆంధ్రప్రదేశ్ లోనే సుందరమైన నగరంగా నెల్లూరు ని తీర్చిదిద్దుదాం అని చెప్పారు. పై కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు శరత్ రెడ్డి సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.