✍️వియం✍️ ఇంటింటా రేషన్ పంపిణీ మొబైల్ వాహనదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతీనెలా ఒక్కో వాహనదారుడికి ఇకనుంచి రూ.21 వేలు చెల్లిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం అద్దెకింద రూ.10వేలు, పెట్రోలోకు రూ.3వేలు, హెల్పర్ చార్జీలకు రూ.3వేలు అందజేస్తున్నారు. వారి ఇబ్బందులను గుర్తించిన సర్కార్ ఇకపై అద్దె రూ.13వేలు, హెల్పర్ చార్జీలకు రూ.5వేలు, పెట్రోలు గతంలోలాగే రూ.3వేలు అంటే మొత్తం రూ.21 వేలు చెల్లిస్తామంది.