State Politics News {Nellore}:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తపాలా ఉద్యోగుల సమన్వయ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ డిమాండ్ చేశారు.శుక్రవారం పెద్ద పోస్టాఫీస్ వద్ద తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారు నిరసన చేశారు.ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ
..కోవిడ్19 లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు10లక్షల నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలని.. కోవిడ్ లో క్యారెంటన్ లో ఉన్న వారికి ప్రత్యేక సెలవులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.అలాగే తాడేపల్లి గూడెం, తిరుపతి, అనంతపురం ఎస్పీ లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పోస్టాఫీస్ లో ఎస్పీ ఓ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ నేతలు ఏవీ కృష్ణయ్య, వెంకయ్య,పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#