చంద్రబాబునాయుడ్ని టచ్ చేసే దమ్ము వైసీపీకి ఉందా..? - టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
State politics news {nellore}:
సజ్జల వీధి కుక్కలా మొరుగుతున్నాడు.. చంద్రబాబునాయుడిని అడ్డుకుని, ఆయన్ని టచ్ చేసే దమ్ము వైసీపీ నేతలకు ఉందా అని నెల్లూరు సిటి ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి చంద్రబాబునుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని మినీ బైపాస్ రోడ్,జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారుడుగా ఉంటున్న సజ్జల వీధి కుక్కలా ...ఇష్టమొచ్చినట్లు మొరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై దాడి జరిగితే తామేమీ చెయ్యలేమన్న వ్యాఖ్యలు.. ప్రభుత్వ అసమర్దతకు నిదర్శనంగా ఉన్నాయన్నారు.. జగన్ పాదయాత్రను అడ్డుకోమని అధికారంలో ఉన్నప్పుడు తమ అధినేత పిలుపు ఇచ్చుంటే.. జగన్ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యగలిగేవాడా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత, చంద్రబాబునాయుడికి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రభుత్వం ఓర్వలేకపోతుందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందన్నారు. సజ్జల చేసిన వ్యాఖ్యలు
చంద్రబాబునాయుడిపై దాడి చెయ్యమని వైసీపీ కార్యకర్తలు ఉసిగొల్పుతున్నట్లు ఉందన్నారు. సజ్జల చేసిన వ్యాఖ్యలపైన సుమోటాగా తీసుకుని డీజీపీ కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. వైసీపీకి ఓటెయ్యకపోతే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని, పథకాలు ఎవడమ్మ మొగుడు సొమ్ముతో నడుపుతున్నారో చెప్పాలన్నారు. ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్న సజ్జల రామకిష్ణారెడ్డి ప్రతిపక్షనేతలను బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సజ్జల పిచ్చి వాగుడుకు, కుక్క మొరుగులకు, ఆయన బెదిరింపులకు టీడీపీ సామాన్య కార్యకర్త కూడా భయపడడని వ్యాఖ్యానించారు. వైసీపీకి దమ్ముంటే విశాఖను ప్రయివేటీకరణ కాకుండా చూడాలని, ప్రత్యేక హోదా వచ్చేలా చూడాలన్నారు. మోడీని చూస్తే ప్యాంట్లు తడుపుకునే వైసీపీ నేతలా మా..నాయకుడిపై వ్యాఖ్యలు చేసేదంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సజ్జల ఒళ్లు దగ్గర పెట్టుకుని మట్లాడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మామిడాల మధు, కప్పిర శ్రీనివాసులు ,పిట్టిసత్య నాగేశ్వరరావు,ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్,మస్తాన్, జాఫర్, సురేష్ ,ప్రణయ్ ,సుజన్ తదితరులు పాల్గొన్నారు.