State politics news(V M):
నెల్లూరు జిల్లాలో నాలుగోవిడత లో వచ్చిన ఫలితాలలో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి అన్నం శారదమ్మ వైసీపీ అభ్యర్థి ఆకుల భారతి పై 501 ఓట్ల మెజార్టీ తో నరుకూరు సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ సందర్భంగా "స్టేట్ పాలిటిక్స్" తో ఆమె మాట్లాడుతూ.. ఇంతటి భారీ మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలకు, మద్దతు తెలిపిన టీడీపీ నాయకులకు,కార్యకర్తలుకు,బీజేపీ నాయకులకు, కార్యకర్తలు కు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు స్మశాన వాటిక , ధోభీ ఘాటు లను ఏర్పాటు చేస్తామని, అలాగే పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపి గ్రామాన్ని ఆరోగ్యవంతంగా.. ప్రజాభివృద్ధికి కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అన్నం శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.