ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:మెప్మా పిడి రవీంద్ర

 


 ✍️వియం✍️: రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి  అనిల్ అన్న  ఆదేశాల మేరకు మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో మెప్మా సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. నెల్లూరు నగరం 6వ డివిజన్ ,పప్పులవీధి లోని పాండురంగ అన్నదాన సమాజంలో ఏర్పాటు చేసిన మెప్మా సర్వసభ్య సమావేశ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా మెప్మా పిడి రవీంద్ర బాబు  పాల్గొన్నారు. ప్రజలందరు మెప్మా ఆధ్వర్యంలో ఇచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిడి ప్రజలను కోరారు.అలాగే డివిజన్ ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందించడంలో డివిజన్ ఇంఛార్జ్ శ్రీధర్ బాగా కృషి చేస్తున్నారన్నారు.అంతకుముందు పిడి రవీంద్ర ని శాలువా తో  డివిజన్ ఇంఛార్జ్ మద్దినేని శ్రీధర్ సన్మానించారు.ఈ కార్యక్రమంలో యువనాయకుడు ముక్కాల ప్రేమ్ సాయి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మెప్మా సిబ్బంది ,ఆర్ పి యస్ ప్రజలు పాల్గొన్నారు.