State politics (spl beauro):
★మండిపడుతున్న మహిళలు,విపక్ష పార్టీలు
★మూడు నెలల్లో 200 పెరిగిన గ్యాస్ ధరలు.
★సబ్సిడీ లో కూడా కొర్రీ పెట్టిన కేంద్రం
★గ్యాస్ బండ ధర సుమారు820 నుండి855 వరకు చేరింది.
★త్వరలో1000 రూపాయలకు చేరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా
★దీనితో గ్యాస్ స్టౌ వెలిగించకుండానే వంటింటిలో మంట రేగుతోందని మహిళలు ఆగ్రహం
న్యూస్ ఫోర్స్,బ్యూరో: గతంలో కాంగ్రెస్ గ్యాస్ ధర పెంచిందంటే రోడ్లపైకి చేరి నిరసనలు చేసి ధరలు అదుపుచేయలేని చేతకాని ప్రభుత్వమని మండిపడ్డ అప్పటి ప్రతి పక్షం ఇపుడు అధికారంలోకి వచ్చి సామాన్య కుటుంబాల నడ్డి విరుస్తుందని విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
నీతులు చెప్పడం ఎదుటివారికి తమదాక అవి వర్తించవని బీజేపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ..గ్యాస్ ధరలు పెంచేస్తుందని సీపీఐ, సీపీఎం,ప్రధాన విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం360 నుండి460కి 10ఏళ్ల పాలనలో గ్యాస్ ధరలు 3,4సార్లు పెంచితే బీజేపీ ప్రభుత్వం ఏడాదికి 7సార్లు పెంచుకుంటూ...1000కి చేరువలో వెళుతుందని,సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై పెనుభారం మోపుతూ..వంటింటిలో పెద్ద గుది బండ లా గ్యాస్ బండ ని చేసారని దుయ్యబట్టుతున్నారు. గ్యాస్ నిత్యవసరంగా మారిపోయిందని.. దీనితో ప్రతిది ముడి పడి ఉంది.వంటింటి కష్టాలను కేంద్రప్రభుత్వం సామాన్య కుటుంబాలపై పెనుభారమే మోపిందని చెప్పవచ్చు.