✍️వియం✍️: నెల్లూరు జిల్లా సంగం మండలం వంగల్లు గ్రామంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ లోకి చేరారు.సోమవారం నెల్లూరు నగరం భారీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో వంగల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.వారిని మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ఆగ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.