ఇంటింటి ప్రభుత్వ పథకాలు పై ఆరా తీస్తున్న మాల్యాద్రి


      

 ✍️వియం✍️ :  నెల్లూరులో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్  ఆదేశాల మేరకు 7వ  డివిజన్ వైసీపీ ఇంఛార్జి కిన్నెర మాల్యాద్రి  ఇంటింటికి తిరిగి  ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయో లేదో ప్రజలను అడిగి తెలుసుకున్నారు.శనివారం నెల్లూరు నగరంలోని 7వ డివిజన్ లో 14వ రోజు వీవర్స్ కాలనీ నందు ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వైకాపా నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.