నెల్లూరు రూరల్ లో వైసీపీ దౌర్జన్యాలు , బెదిరింపులను సాగనివ్వం- టిడిపి అధ్యక్షులు అజీజ్

 


✍️వియం✍️ : నెల్లూరు రూరల్  నియోజకవర్గంలో అధికార పార్టీ బెదిరింపులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.
నెల్లూరు రూరల్ పరిధిలోని కాకుపల్లి సచివాలయం లో కాకుపల్లి, మాదరాజు గూడూరు, పెనుబర్తి, కలివెలపాలెం గ్రామాల సర్పంచ్ అభ్యర్థుల చేత, వార్డ్ మెంబర్ల చేత   టీడీపీ అధ్యక్షులు అజీజ్ నామినేషన్ వేయించారు. నియోజకవర్గం లోని కాకుపల్లి లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ....
అధికారం ఉందని నెల్లూరు రూరల్ లో కొంతమంది వైసీపీ నేతలు వెర్రెక్కిపోయి టిడిపి అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు.
రాత్రి, పగలు అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి బెదిరింపులు చేస్తారా.. మీలాంటి వాళ్ళని భూమి ఎంతో మందిని చూసింది అంటూ అబ్దుల్ అజీజ్ ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రపంచ నియంత హిట్లర్ లాంటి వాడే మట్టిలో కలిసిపోయాడని గుర్తు చేశారు.

               స్థానిక సంస్థల ఎన్నికలు నిస్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలి తప్ప బెదిరింపులతో కాదన్నారు.ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య , జలదంకి సుధాకర్ , సాబీర్ ఖాన్, మాతంగి కృష్ణ, రేవతి, ఆనంద్, మౌలానా అజీజ్, రంగా, గిరిధర్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#