17వ డివిజన్ లో ప్రజాబాట పట్టిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

 


State politics news {nellore rural}:

 నెల్లూరు రూరల్  నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ ,వెలగచెట్టుసంగంలో   రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,నగర కమీషనర్ దినేష్ కుమార్ లు  శనివారం ప్రజా బాట చేపట్టారు.
ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను గుర్తించి,
వాటి పరిష్కారం కోసం విస్తృతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పర్యటించారు.
ప్రజలు ముందుకువచ్చి సూచనలు,సలహాలు మరియు సద్విమర్శలను సైతం స్వీకరించి లోపాలను సరిదిద్దుకునేందుకు మీ ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజల తో అన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.