✍️వియం✍️: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామ పంచాయతీల్లో నామినేషన్ లు వేయండి.. అధికార పార్టీ దౌర్జన్యం లను తీవ్రంగానే అడ్డుకుంటామని, ప్రతి గ్రామపంచాయతీలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు నామినేషన్లు వేసేలా నెల్లూరు టిడిపి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా నెల్లూరు రూరల్ పరిధిలోని వివిధ మండలాల నాయకులతో విస్తృతంగా సమావేశాలు జరిపారు.
ఆదివారం కాకు పల్లి గ్రామ నాయకులతో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు,రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు చేయాలని ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లోను సహించమని హెచ్చరించారు. ప్రతి కార్యకర్త వెనుక తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ప్రతి గ్రామంలో నామినేషన్లు పడాలన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నేత ఓట్టూరు సంపత్ రాజు , సాబీర్ ఖాన్, జలదంకి సుధాకర్, తెలుగు యువత నెల్లూరు పార్లమెంట్ కోఆర్డినేటర్ కాకర్ల తిరుమల నాయుడు, రేవతి, అమృల్లా, కాకుపల్లి గ్రామ నాయకులు పాల్గొన్నారు.