400మంది నివార్ తుఫాన్ బాధిత కుటుంబాలను ఆదుకున్న లైన్స్ క్లబ్స్

నివార్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

✍️వి యం✍️ : నెల్లూరులోని  లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు ఎమర్జెన్సీ గ్రాంట్ ఫర్ సైక్లోన్ నివార్ ద్వారా నివార్ తుఫానుకు దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకున్నారు.నగరంలోని కేఎల్ రావు కళ్యాణమండపం నందు ఆదివారం జరిగిన కార్యక్రమంలో నివార్ తుఫాను బాధితులు అయిన 400 కుటుంబాలకు వారికి వెయ్యి రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు. అలాగే వెంగళరావు నగర్ మునిసిపల్ పాఠశాల విద్యార్థులకు క్రీడా సామగ్రి,క్రీడా దుస్తులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ రమేష్ నాథ్ రెడ్డి ,మాజీ గవర్నర్లు సురేష్, అమృతవల్లి, వివిధ లయన్స్ క్లబ్బుల అధ్యక్షులు రామానుజం, పేర్ల జనార్దన్ కార్యదర్శులు,జోన్ చైర్మన్లు చెవుల సుప్రియ యుగంధర్, కృష్ణమూర్తి, లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ సతీష్ కుమార్, వివిధ క్లబ్బులో మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.