రైతులకు మద్దతు తెలిపిన నెల్లూరు బీసీ సంఘం



✍️వియం✍️ ..కేంద్రప్రభుత్వం రైతులను మోసగించే విధంగా3 బిల్లులను తీసుకుని వచ్చిందని దానిని నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ..రేపు రైతులకోసం భారత్ బంద్ కు మద్దతు తెలుపుతున్నామని  జిల్లా బీసీ సంక్షేమ సంఘం మహిళ అధ్యక్షురాలు కోమారి విజయమ్మ, జిల్లా ప్రచార కార్యదర్శి వెంపులూరు మల్లికార్జున్ గౌడ్ లు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర రావు ఆదేశాల మేరకు జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం రైతు భారత్ బంద్ లో పాల్గొని తమ నిరసన తెలియజేస్తామన్నారు.రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని, రైతు శ్రేయస్సు కోసం స్వామి నాథన్ కమిటీ సిఫారసు ను కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు.రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయని మల్లికార్జున్ గౌడ్ తెలిపారు.