నెల్లూరు రూరల్ లో సర్టిఫికేట్ ల మాయాజాలం
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:సంక్షేమ పథకాలుకు అర్హత కావాలంటే ప్రభుత్వం నిర్దేశించినవి తప్పనిసరిగా లబ్ధిదారులకు కావాల్సిందే.అయితే ఆ సర్టిఫికేట్ ల కోసం నెల్లూరు రూరల్ మండల రెవిన్యూ కార్యాలయంలో చెప్లు అరిగేలా తిరిగిన శూన్యమే. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కావాలంటే ఆన్ లైన్ పని చేయట్లేదని ఆ కార్యాలయ సిబ్బంది రోజుల తరబడి చెప్పడం విశేషం.
ప్రజల అవసరమైన పత్రాలు జారీ చేసే విధంగా మండల వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ప్రజలకు అవసరమైన ధ్రువ పత్రాలు నిమిత్తం పనిచేసి పెట్టాల్సింది పోయి నానా విధాలుగా ఆలస్యం చేస్తున్నారనేది వినిపిస్తున్న ఆరోపణలు. ప్రజలను ధ్రువీకరణ పత్రాలు కోసం మండల కార్యాలయంకి వెళ్ళితే ఆ పనులను అక్కడి సిబ్బంది పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలి.రోజుల తరబడి అయితే ఆన్ లైన్ పనిచేయడం లేదనేది అవాస్తమైనదని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ప్రజలకు ఆధ్రువ పత్రాలు అందేలా చూసి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత కల్పిస్తారని ఆశిద్దాం.