ముత్తుకూరు లో అభివృద్ధి పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
★7కోట్లతో మత్స్యకారులు అభివృద్ధి కోసం పనులు ప్రభుత్వం చేయలేనిది వైసీపీ ప్రభుత్వం చేస్తోంది.
న్యూస్ ఫోర్స్,సర్వేపల్లి:నియోజకవర్గ పరిధిలోని ముత్తుకూరు మండల కేంద్రంలో సర్వేపల్లి శాసనసభ సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు.శుక్రవారం జాతీయ మత్స్య రైతు దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు కు రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా 7కోట్ల రూపాయల తో వివిధ పనులు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలను జరిపారు. ముత్తుకూరు మండల కేంద్రంలో మత్స్య కారుల మార్కెట్ కి శంఖుస్థాపన, మత్స్య కళాశాలలో ఏర్పాటు చేసిన కళాశాల సముదాయాన్నీ ప్రారంభించారు. ఆక్వా రైతులను దారుణంగా మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని కాకాని విమర్శించారు.
గత ప్రభుత్వం మత్స్యకారులు అభివృద్ధి కి త్రిలోదకాలిచ్చిందని దుయ్యబట్టారు. అందుకే తమ ప్రభుత్వం సీఎం జగన్ నేతృత్వంలో మత్స్య సంపదను అభివృద్ధి పరిచేందుకు పలు అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టామన్నారు.ముత్తుకూరు లోని మత్స్య కళాశాల ను మోడల్ కళాశాలకు తాను సహకరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#