శాంతి భద్రతలెక్కడా.. అన్యాయమే తాండవమా..!?

శాంతి భద్రతలెక్కడా.. అన్యాయమే తాండవమా..!?



★వందల కొద్ది ఫిర్యాదుల దారులు బారులు


★పట్టించుకోని అధికారులు.. పైసలొస్తాయంటే సై..!లేదంటే నై..!?


★ఇది ఆ పోలీస్ స్టేషన్ పనితీరు.. రోజులు తరబడి కేసుల కాలయాపన..!?


★మరి పరిష్కారంకి మార్గమేది..దుర్మార్గులపై కేసేది..!?


న్యూస్ ఫోర్స్,నెల్లూరు:శాంతి భద్రతులెక్కడ.. ఆ స్టేషన్ పరిధిలో అన్యాయమే తాండవిస్తున్నది. సమస్యల పై స్టేషన్ గడప త్రొక్కితే అక్కడ పరిష్కారం భరోసా కంటే అవమానం, ఛీ దరింపులే ఎదురవుతాయి.బాధితుల పరిష్కారంకంటే వారి కాలయాపన స్మార్ట్ ఫోన్ల పై చూపులే అక్కడి అధికారులు దృష్టి ఆవరించి ఉంది. గత కొన్ని రోజులుగా ఆ స్టేషన్ పని తీరుపై ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యేక  దృష్టి సారించి ఈ కథనంని  స్టేట్ పాలిటిక్స్ ముందుంచుతుంది.


              నెల్లూరు నగరానికి 6 పోలీస్ స్టేషన్ లు ఉన్నాయి.అవి ప్రజలకు మెరుగ్గా సేవలందించాలి అని నగర పరిధి ఉన్నతాధికారి అయిన డిఎస్పీ ప్రత్యేకంగా పలు సమావేశాల్లో, సాధారణ, క్రైమ్ మీటింగ్ లలో ఆయా స్టేషన్ అధికారులకు తెలుపుతున్న వాటిని వారు పెడచెవిన పెట్టి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు ప్రతి రోజు చూస్తున్నవే, వింటున్నవే గా ఉన్నాయి.స్టేషన్ కి వచ్చే బాధిత ఫిర్యాదు దారుల పట్ల దురుసు ప్రవర్తన,అవమానాలే జరుగుతున్నాయి.ఇందులో భాగంగా నెల్లూరు నగర స్టేషన్ పరిధిలో రెండోవది అయిన నవాబుపేట్  పోలీసు స్టేషన్ గురుంచి చెప్పుకోవాలి. అక్కడి సిబ్బంది, అధికారులు ఎవరికి వారే అన్నట్లుగా ప్రజలకు సేవలందిస్తున్నారు.ప్రజలకి మాత్రం సమస్యకి పరిష్కారం దొరికే ప్రసక్తిలేకుండా వారు పనితీరు కనబరుస్తుంటారు.


     స్టేషన్ కి ఫిర్యాదు ఇవ్వడానికి వస్తే వారి పట్ల నిర్లక్ష్యం, అవమానకరంగా మాటల దాడులు,ఫిర్యాదు రాసి ఇస్తే అలా కాదు అంటూ ఆ ఫిర్యాదులని ఆరోపణ దారులకి అనుకూలంగా  చేస్తూ బాధితులకు అన్యాయమే చేస్తున్నారు.అంతే కాకుండా ఆ స్టేషన్ పరిధిలో ఈవ్ టీజింగ్, న్యూసెన్స్,వ్యభిచారం,ఆకతాయిల ఆగడాల పై ఫిర్యాదు చేసిన దానికి పరిష్కారం దొరకదు. ఫిర్యాదు ఇచ్చిన వారిపైనే కేసులు పెడతామంటూ బెదిరించడంలు,కేసు పెట్టడం చేస్తున్నారు.ఏదేమని ప్రశ్నిస్తే పోలీస్ నే ప్రశ్నిస్తావా అంటూ వారిపై కోపోద్రోక్తమవుతున్నారు.దీనితో ఆ స్టేషన్ లో న్యాయం కంటే అన్యాయమే తాండవిస్తూ బాధితులకు కంటనీరు మిగుల్చుతుంది.ఈ కలియుగంలో  కాలికేయులు ఎక్కువే వారి బారిన పడి బాధితులు స్టేషన్ మెట్లెక్కుతుంటే వారికి భరోసా నివ్వడం మానేసి ఆ కాలికేయులకే కొమ్ముకాస్తూ హింస చేసే వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు.అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కలిగిన రక్షక భటులు వారికే వంత పాడుతూ ఫిర్యాదు దారులను దుఃఖం లో ముంచెత్తుతున్నారన్న అపవాదు మూట గట్టుకుంటున్నారన్నది జగమెరిగిన సత్యమే.ప్రజల కడుతున్న పన్నులతో జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు,సిబ్బంది వారికి సేవ చేయాలంటే చేయి తడపనిదే పనికావడంలేదు అనేది ఆ స్టేషన్ ఫిర్యాదు దారుని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.గతంలో.. శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మారెడ్డి,మల్లారెడ్డి, గజరావ్ భూపాల్  లాంటి యస్పీ లు,బాలిరెడ్డి,రాధికారెడ్డి, లాంటి డిఎస్పీ లు పోలీస్ స్టేషన్ లపై ,ముఖ్యంగా నగరంలో ఉన్న స్టేషన్ పనితీరుపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అవి ప్రజలకు సక్రమంగా సేవలందించేలా చర్యలు చేపట్టి ప్రజలచే శభాష్ అనిపించుకున్నారు.


              అయితే  అందుకు భిన్నంగా నవాబుపేట్ పోలీస్ స్టేషన్ పనితీరు ప్రజలకు ఫిర్యాదు చేస్తే దానికి రసీదు ఇవ్వడంలోను నిర్లక్ష్యమే.. ఎందుకంటే ఫిర్యాదు కి రసీదు ఇస్తే దానికి సమాధానమ్ చెప్పాల్సివస్తున్నదని ఆ స్టేషన్ లో ఫిర్యాదు నో జవాబు అన్నట్లు వారి సేవ ఉండడం పై పలువురు బాధితులు మండిపడుతున్నారనేది చెప్పకనే చెప్పవచ్చు. ఇకనైనా స్టేషన్ కి వచ్చే బాధితుల పట్ల మర్యాదగా వారికి న్యాయం చేకూరేలా ఉన్నతాధికారుల దృష్టి సారించి బాధితులకు  భరోసానిచ్చే న్యాయ పరి రక్షణ చేస్తారని ఆశిద్దాం.