మంత్రి ఇలాకాలో ఒక్క ప్రాజెక్ట్ లేదు..!?
★ఘనంగా ఏడాది పూర్తయింది..ఒక్క ఫ్యాక్టరీకి పునాదెక్కడా..?
★ప్రజల నమ్మకాన్ని..ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారా..?
★నియోజకవర్గ నిరుద్యోగులకు ఉపాధవకాశాలు కల్పించగలరా..?
★గతంలో ఆత్మకూరుని అభివృద్ధి చేసిన ఆనం కంటే మేకపాటి మెరుగ్గా చేయగలరా..!?
న్యూస్ ఫోర్స్,ఆత్మకూరు:ప్రజా అభీష్టం మేరకు రాష్ట్రములో 80శాతం పైగా సీట్లను సాధించి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.ఆదిశగానే అడుగులు వేస్తూ ఏడాది కాలం పూర్తయింది.
అయితే జిల్లాలో యువ మంత్రులుగా ఇద్దరికి చోటు దక్కింది.అందులో ఒకరు ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి. వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలుపొందిన యువ ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఆత్మకూరునియోజకవర్గ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆత్మకూరు నియోజకవర్గ స్థాయిలోను నిరుద్యోగులకు ఉపాధి కల్పన, పేద, బడుగు,బలహీన వర్గాలును అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు.దానిని నిలబెట్టుకుంటారని ఆ నియోజకవర్గ ప్రజలు,నిరుద్యోగులు ఎదురుచుస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది.భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మేకపాటి గౌతమ్ రెడ్డి ఏడాది అయ్యింది. అయితే ఒక్క పరిశ్రమ కూడా మంత్రి ఇలాకలో పునాది వేసిన దాఖలాలు లేవు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ ప్రాంత ప్రజల ఆశలు ఆడియాస చేస్తారో.. లేక నూతన పరిశ్రమ ఏర్పాటుకు పునాది రాయి నాటు తారో మంత్రి నిర్ణయంలోనే తెలియాలి.
గతంలో ఆనం రామనారాయణ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆత్మకూరుఎమ్మెల్యే గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వేల కోట్ల రూపాయలు నిధులతో ఆత్మకూరుని అంతులేని అద్భుత రీతిలో తనదైన శైలిలో అభివృద్ధి చేసి ఆనం ముద్ర వేసుకున్నారు. అంతకంటే మెరుగ్గా మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రిగా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని అక్కడి నేతలు ,ప్రజలు ఆసక్తితోనే ఎదురుచుస్తున్నారనేది జగమెరిగిన సత్యమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు,అభివృద్ధి ఆత్మకూరు లో మరింత వేగంగా పరిశ్రమలు వెలుస్తాయని అందరూ అనుకున్నారు. జిల్లాలో కొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందడుగు వేస్తున్న ప్రభుత్వ సహకార రూప కల్పన లేదని ఆరోపణలు వినివస్తున్నాయి. ఏదిఏమైనా యువ మంత్రి మేకపాటి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు, నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పేవిధంగా...ఆయన నియోజకవర్గ పరిధిలో పరిశ్రమ లను నెలకొల్పేందుకు అడుగులు వేస్తారో.. లేదో వేచి చూడాల్సిందే.#ఎస్పీన్యూస్#