కోతలు బాబోయ్.. కోతలు..!?


 


★కరెంట్ కోతలతో అల్లాడుతున్న జనం


★వేసవి తాపం ఒక ప్రక్క, కరెంట్ కోత మరోప్రక్క


న్యూస్ ఫోర్స్,నెల్లూరు:భగ భగ మండే సూర్య ప్రతాపం తో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనితో సేద తీరుదామని ఇంట్లో ఫ్యాన్ స్విచ్ వేస్తే అది తిరగదు. కారణం కరెంట్ లేకపోవడం. ఇష్టారాజ్యంగా కరెంట్ కోతలతో విద్యుత్ శాఖ అధికారులు కోతలు విధిస్తుంటే ప్రజలు విల విల్లాడుతున్నారు. వేసవి తాపం వలన ప్రజా అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కోతలు విధించడం ఏమిటని ప్రజల్లో ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు.


                      ముఖ్యంగా నెల్లూరు నగరం నవాబుపేట్ ప్రాంతంలో ఎప్పుడు కరెంట్ ఉంటాదో.. ఎప్పుడు పోతాదో తెలియదు.అర్ధరాత్రి, అపరాత్రి, మధ్యాహ్నం అన్న తేడాలుండవు.ఇష్టం వచ్చినట్లు ఏలా పాలా లేకుండా సమయం కానీ సమయంలో పవర్ కట్ చేస్తూ..ప్రజలతో ఆటలాడుకుంటున్నారనే ఆప్రాంత ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.ఎఫ్ సి ఐ కాలనీ ,నజీర్ తోట,నవాబుపేట్,గాండ్ల వీధిలలో పవర్ ఉన్న సమయం కంటే లేని సమయంలే ఎక్కువని చెప్పవచ్చు.అధికారుల అలసత్వమో..లేక నిర్లక్ష్యమే ప్రజలకి మాత్రం అది నరకంగా మారింది. ఎక్కడ లో ఓల్టేజ్ ఉందొ దానిని సరి చేసి.. సక్రమమైన నాణ్యమైన కరెంట్ అందిస్తే ఇళ్లలో లైట్స్,ఫ్యాన్ లు,ఫ్రిజ్, ఏసీ, టివి లు కాలిపోకుండా ఉంటాయి.ఇలా కరెంట్ కోతలతో సమయం కానీ సమయాల్లో ప్రజలను పలు ఇబ్బందులుకు గురిచేయడమే కాకుండా వారికి నష్టం వచ్చేటట్లు చేస్తున్నారు. ఇకనైనా అధికారులు తక్షణమే స్పందించి నాణ్యమైన, కరెంట్ కోతలు లేకుండా.. ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలకి కోతలు లేకుండా పవర్ ఇస్తారని ఆశిద్దాం.