సంక్షేమ పథకాల ఆద్యుడు సీఎం జగన్
న్యూస్ ఫోర్స్,సర్వేపల్లి: సంక్షేమ పథకాలు ఆద్యుడు, ప్రజలకు బాసటగా నిలిచే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డినే నని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ పేర్కొన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో కార్మికుల కుటుంబాలలో వెలుగు నింపారని,ప్రతి ఒక్క ఆటో కార్మికునికి 10వేలు చొప్పున నగదు పంపిణీ చేప్పట్టిన ఈ దేశంలో ఏకైక వ్యక్తి రాజశేఖర్ రెడ్డి తనయుడు సీఎం జగన్ కే సాధ్యమని తెలిపారు. గురువారం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 2335 ఆటో కార్మికుల కుటుంబాలకు2,33,50,000 నగదు ప్రతి ఒక్కరికి వారి బ్యాంక్ ఖాతా లో జమ చేసారని తెలిపారు.