ఎం ఎస్సార్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల చేయూత
న్యూస్ ఫోర్స్, నెల్లూరు:లాక్ డౌన్ లో సంపాదన లేక ఇబ్బంది పడుతున్నా రజకుల కుటుంబాలను యం ఎస్సార్ సేవా సమితి ఆదుకుంది.ఆదుకోవడం అవసరమే కాకుండా బాధ్యతగా భావిస్తూ మాగుంట శరత్ చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో 20 కుటుంబాలకు నెల రోజులకు సరిపడ నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఎం ఎస్ ఆర్ సేవాసమితి సభ్యులు సాయి బాబు మాట్లాడుతూ "మన ఊరు మన బాధ్యత" అనే నినాధం తో ప్రతిఒక్కరూ తోటి పేద ప్రజలకు తమ వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో నిశాధ్,అమన్,యశ్వంత్,దరహాస్,సుమన్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#