ఉచిత సేవాపరుడు శ్రీనివాసుడు
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ ఆదేశాలతో,జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్ కుమార్ నేతృత్వంలో వైసీపీ కార్యకర్త గండి కోట శ్రీనివాసులు పేదలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ కార్యక్రమాలు వరుసగా చేపడుతున్నారు.గురువారం ఉదయం 8వ డివిజన్ వైసీపీ ఇంఛార్జ్ రఘు ఆధ్వర్యంలో నాయుడు రైస్ మిల్లు వెనుక వైపు నివాసం ఉంటున్న పేదలకు 5రకాల కూరగాయలను ఉచితంగా గండికోట శ్రీనివాసులు,కళ్యాణ్ రెడ్డి గడప గడపకు పంపిణీ చేశారు. ఉచిత కూరగాయల పంపిణీ కార్యక్రమం లాక్ డౌన్ నుండి పలువురు పేదలకు పంపిణీ చేస్తున్నారు.
అలాగే 10వ డివిజన్ రామచంద్రాపురం లో20మంది నిరుపేద కుటుంబాలకు స్టేట్ పాలిటిక్స్ పత్రిక, డివిజన్ కార్యకర్త గండికోట శ్రీనివాసులు సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పుట్టబోయిన వెంకటేశ్వర్లు యాదవ్,సురేష్, రమేష్,చోటు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#