మున్సిపాలిటీ మాస్టర్లలో మణిపూస మురిగిపూడి
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నగర పరిధిలోని మునిసిపాలిటీ పాఠశాలలో పనిచేస్తున్న మాస్టర్లలో మురిగిపూడి ఓ మణిపూస.నెల్లూరు నగరం ఆర్ ఎస్ ఆర్ పాఠశాల నందు ఏ ఎఫ్ సి విభాగంలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పని చేయుచున్న మురిగిపూడి సతీష్ కుమార్ కు మొదటినుంచి సేవాతత్పరత గుణం ఎక్కువగా ఉంది.ఉపాధ్యాయుడుగా విద్యార్థులను తీర్చిదిద్ది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు పొందడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పలు సంస్థల నుంచి మన్ననలు, అవార్డులు అందుకోవడం పరిపాటి.
ఇప్పటికే 70 సార్లు రక్తదానం చేసిన రక్తదాతగా, పల్స్ పోలియో కార్యక్రమం మొదలైన నాటి నుండి ఇప్పటివరకు పల్స్ పోలియో ముందు ర్యాలీ నిర్వహించడం, పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయడం అలవాటైపోయింది. జన విజ్ఞాన వేదిక ,ప్రజాసైన్స్ వేదిక మొదలగు సంస్థల ద్వారా ప్రజలను జాగృతం చేసే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.రోటరీ క్లబ్, లైన్స్ క్లబ్, వాసవి క్లబ్ , జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్లాంటి అంతర్జాతీయ సంస్థలలో అధ్యక్షునిగా, ఎడ్యుకేషనల్ కమిటీ చైర్మన్ గా, డిప్యూటీ గవర్నర్ గా, పలు పదవులు నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు నెల్లూరు ప్రజలకు పలు పాఠశాలలోని విద్యార్థులకు అందించారు. గత పది సంవత్సరాలుగా తన జీతంలో 20 శాతం సేవలకు, 20 శాతం కుటుంబంతో పాటు విహారయాత్రలకు 30 శాతం ఇంటి ఖర్చులకు ,30 శాతం భవిష్యత్తుకు కేటాయించుకుని ఒక పద్ధతి ప్రకారం జీవనం గడుపుతున్న వ్యక్తి సతీష్ కుమార్. కరోనా చైనాలో మొదలైన రోజుల్లోనే తన విద్యార్థులకు దాని గురించి అవగాహన కలిగించడం, న్యూస్ పేపర్ ద్వారా ప్రజలకు అవగాహన కలిగించడం, ఈ వ్యాధి ఇండియాలో ప్రారంభమైన తర్వాత వివిధ సంస్థల ద్వారా ప్రజలకు మాస్క్ లను,శానీటైజర్లను, సబ్బులను ఫల సరుకులనులను, ఆహారాన్ని ,కూరగాయలను వివిధ సంస్థల ద్వారా అందించారు.అంతే కాకుండా తమ విద్యార్థులు లాక్ డౌన్ సమయంలో అనవసరంగా ఇంటి బయటకు రాకుండా వారి రిక్రియేషన్ కోసం వివిధ రకాలైన పజిల్స్ ,వ్యాసరచన పోటీలను, డ్రాయింగ్ పోటీలను నిర్వహించడమే కాకుండా ప్రతినిత్యం ఆ రోజు యొక్క ప్రాముఖ్యత గురించి వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు. నెల్లూరు ఫీలట లాజికల్ సొసైటీ కార్యదర్శిగా ఉండి నెల్లూరు నందు రెండుసార్లు కాయిన్స్ అండ్ నోట్స్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారు.అమరజీవి అంటే ప్రాణం గా భావిస్తూ వర్దంతి,జయంతి సందర్భంగా ఠంఛన్ గా పాల్గొని నివాళులు అర్పించే గొప్పమనసున్న వ్యక్తిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.#ఎస్పీన్యూస్#