పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణి
న్యూస్ ఫోర్స్,కోట:పోషకాహారలోపం వలన కరోనా వ్యాధి తీవ్రత మనుషుల్లో ఎక్కువగా ఉంటుందని, పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో కోట మండలం వంజివాక పంచాయతీలోని చిన్న వంజివాక, పెద్దవంజివాకలకు సంబంధించి ఎస్టీ కాలనీ, బీ.సీ కాలనీలలో గురువారం 550 కుటుంబాలకు 10 గుడ్లు చొప్పున అందజేసారు. ఈ కార్యక్రమంలో పాదర్తి రాధాకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్, దువ్వూరు సాయి కృష్ణారెడ్డి, ఇళ్ల మాల వెంకటాద్రి, టింకర్ రవి, పలగాటి సాయికృష్ణ రెడ్డి పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#