రెడ్ ..రెడ్.. రెడ్ జోన్..స్టోన్ హౌస్ పేట్ రెడ్ జోన్

రెడ్ ..రెడ్.. రెడ్ జోన్..స్టోన్ హౌస్ పేట్ రెడ్ జోన్


★రేపటి నుండి స్టోన్ హౌస్ పేట్ లాక్డౌన్.. అన్ని దుకాణాలు బంద్



న్యూస్ ఫోర్స్,నెల్లూరు:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజు రోజుకు తన బలాన్ని పెంచుకుంటూ ప్రజలకు భవిష్యత్ పై నమ్మకాన్ని పోగేట్టేలా చేస్తోంది.వరుసగా కేసుల మీద కేసులు  నమోదు అవుతూ కరోనా బారిన పడుతున్నారు ప్రజలు.ఆత్మకూరు బస్టాండ్ నుండి నవాబుపేట్ ఇందిరమ్మ బొమ్మ వరకు బారికేడ్లతో మూసివేశారు పోలీసులు.స్టోన్ హౌస్ పేట్, కొత్త వీధి,పప్పుల వీధులలో కరోనా బారిన పడిన వారు ఉండడంతో ఆయా ప్రాంతాలను రెడ్ జోన్ గా పరిగణించారు.
                      స్థానిక నవాబుపేట్ పోలీసు స్టేషన్ సిఐ వేమారెడ్డి అన్ని ప్రాంతాలను వారి ఆధీనంలోకి తీసుకుని తగు జాగ్రత్తలు తీసుకున్నారు.ప్రధాన కూడలిలను సైతం బారికేడ్లతో బ్లాక్ చేసి దగ్గరుండి వాటికి వెల్డింగ్ చేయించారు. ప్రజలు కరోనా బారిన పడకుండా నియంత్రణలో భాగంగా సిఐ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే నిత్యం రద్దీగా ఉండే స్టోన్ హౌస్ పేట,పప్పులవీధి ప్రాంతాలు రెడ్ జోన్ కారణంగా నిత్యావసర సరుకులు లభించే ప్రాంతంలో అన్ని దుకాణాలు మూసివేయబడతాయని సిఐ వేమారెడ్డి స్టేట్ పాలిటిక్స్ కు తెలిపారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నవాబుపేట్ వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డ్ లో నిత్యావసర సరుకుల దుకాణాలు ఏర్పాటు అయ్యేలా చేశామన్నారు. పలువురు వ్యాపారస్తులు సహకారంతో ఈ రెడ్ జోన్ ప్రాంతాన్ని గ్రీన్ జోన్ ప్రాంతంగా మారేలా కృషి చేస్తామన్నారు.  ప్రజలు కూడా సహకరించి స్వచ్ఛందంగా ప్రభుత్వం తెలుపుతున్న జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుండి దూరంగా ఉండగలరని ఆయన అన్నారు.
                 నవాబుపేట్ నుండి రెండు మార్గాలు.ఇందిరమ్మ బొమ్మ వద్ద నుండి  తోటబడి మీదుగా లక్ష్మీపురం,వీవర్స్ కాలనీల  శెట్టిగుంట రోడ్ మీదుగా  ఆత్మకూరు బస్టాండ్ వైపు వెళ్లేలా మార్గం.అలాగే నవాబుపేట్ పోలీస్ క్వార్టర్స్ లైన్ ముకుందా పురం మీదుగా వివేకానంద కాలేజి ,ఆర్ యస్ ఆర్ పాఠశాల ప్రక్క వీధిలో నుండి రేబాల వారి వీధి మీదుగా సి ఆర్ పి డొంక నుండి ఆత్మకూరు బస్టాండ్ కు వెళ్లేలా మార్గాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుండి వచ్చే వారు జాతీయ రహదారి (యన్ హెచ్ 16)మీదుగా నవాబుపేట్ మార్కెట్ యార్డ్ కు వచ్చి వారికి కావాల్సిన సరుకులను కొనుగోలు చేసుకుని ప్రభుత్వం తెలిపిన సమయంలో రాక పోకలు సాగించాలన్నారు.ప్రజలందరు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని నిర్లక్ష్యం గా ఉంటే కరోనా కి బలవక తప్పదన్నారు.#ఎస్పీన్యూస్#