అనుభవం లేని మంత్రి .. బలవుతున్న
అధికారులు-అధికార ప్రతినిధి ఆనం
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:10 వేల క్యూసెక్కుల నీటి విడుదల వెనక ఉన్న పెద్ద తలకాయలను బయట పెట్టాలని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.స్థానిక మిని బైపాస్ రోడ్, యన్ టి ఆర్ భవన్ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు సంబంధించిన ఈ వ్యవహారంలో కేవలం ఇద్దరు అధికారులను బలి చేసి ఈ విషయాన్ని కప్పి పుచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆనం ధ్వజమెత్తారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నీటిపారుదల శాఖలో నిర్వహణలో కనీస పరిజ్ఞానం లేదన్నారు. తనకు చేత కాకపోతే వేరే శాఖకు మారిపోవాలని అర్ధ రాహిత్యం పనులు మానుకోవాలని తనదైన శైలిలో విమర్శలు సంధించారు. నెల్లూరు రైతాంగాన్ని మాత్రం బలి పెట్టవద్దన్నారు. మీసాలు తిప్పటం అందరికీ వచ్చునని ఆయన ఇంట్లో మీసాలు తిప్పుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు.అంతే కాకుండా తన చెంచాల చేత ఫేస్ బుక్ లలో పోస్టింగులు పెట్టిస్తే తాను భయపడేది లేదని ఆనం వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదని ప్రజలపై భారాలు మోపుతూ వారిని అష్ట కష్టాల పాలుచేస్తుందన్నారు.ఇష్టారాజ్యంగా పాలన చేస్తే ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#