పేద ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:లాక్ డౌన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు నరసింహ స్వామి జయంతి పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని రామ్ నగర్ ప్రాంతంలో మాగుంట శరత్ చంద్రారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు నిఖిల్ రెడ్డి మాట్లాడుతూ తమ వంతు బాధ్యతగా పేదలకు సహాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు 150 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ ఆర్ యువజన సేవా సమితి నేతలు మల్లి, సాయిబాబా,నిషాద్, అమన్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#