పేద ప్రజలకు నారాయణ కిట్ అందజేత
న్యూస్ ఫోర్స్, నెల్లూరు:నగరంలోని 11వ డివిజన్ లో పేద ప్రజలకు నారాయణ కిట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి పొంగూరు నారాయణ దాతృత్వంతో నగర టీడీపీ ఇంఛార్జ్ యం. శ్రీధర్ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రాయపు పాలెంలో 500 మంది నిరుపేదలకు కూరగాయలు,నిత్యావసర వస్తువులు కలిపి నారాయణ కిట్ గా నగర ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు తొగురు శివకుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగభూషణమ్మ,చిన్నక్క,రామయ్య, చంద్ర తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#