అభాగ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వార్డు సెక్రెటరీస్
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:కరోనా మహమ్మారి ఒక ప్రక్క లాక్ డౌన్ మరో ప్రక్కతో అల్లాడుతున్న అభాగ్యులకు తామున్నామంటూ 9వ డివిజన్ 3వ సచివాలయ కార్యదర్శులు ఆపన్న హస్తమందించారు. నగరంలోని 9వ డివిజన్ పరిధిలో అంబేద్కర్ నగర్, ఎస్టీ కాలనీలో పేద ప్రజలకు 9వ డివిజన్ 3వ సచివాలయం కార్యదర్శులందరు కలిసి వారానికి సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
వారి జీతాలలో కొంత మొత్తాన్ని అందరూ కలిసి కేటాయించి, వెనుకబడిన తరగతుల ప్రజలను ఆదుకున్నారు. వారికి వారానికి సరిపడే సరుకులు పంపిణీ చేయడం పట్ల పలువురు వారిని ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ విఆర్వో చందన,3వ సచివాలయం పరిపాలన కార్యదర్శి యం. మహేష్,పొదుపు,అభివృద్ధి కార్యదర్శి జి.శశి కిరణ్,మహిళ సంరక్షణ కార్యదర్శి పి.శర్వాణి, విద్య ,సమాచారం పొందుపరిచే కార్యదర్శి పి.రమ్య,ప్రణాళిక,నియంత్రణ కార్యదర్శి పి.శివకేసమ్మ,ఆరోగ్య కార్యదర్శి ఎ.రాజేశ్వరి 18మంది వాలంటరీలు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#