కాకాణి పిలుపుకు వెల్లువలా రైతుల స్పందన

కాకాణి పిలుపుకు వెల్లువలా రైతుల స్పందన



న్యూస్ ఫోర్స్, సర్వేపల్లి :నియోజకవర్గంలో పొదలకూరు, టి.పి.గూడూరు మండలాల్లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు.కాకాణి పిలుపుకు స్పందించి పేదలకు బియ్యం పంపిణీ చేయడానికి, ఇతోధికంగా సర్వేపల్లి నియోజకవర్గ రైతులు సహకరిస్తున్నారు.పేదలకు పంపిణీ కోసం 43 పుట్ల (36.5 టన్నుల) ధాన్యాన్ని  ఎమ్మెల్యే కాకాణికి  పొదలకూరు, టి.పి.గూడూరు మండలంలోని రైతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అందిస్తున్న ధాన్యం వెలకట్టలేనిదన్నారు.కరోనా నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడటం దురదృష్టకర సంఘటనని ,అయితే ఆదుకోవడానికి రైతులు ముందుకు రావడం గొప్ప పరిణామన్నారు.సర్వేపల్లి నియోజకవర్గ రైతుల స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందన్నారు.తెలుగుదేశం పార్టీ నాయకులు సహకరించక పోయినా, సేవా కార్యక్రమాలపై విమర్శలు గుప్పించి అడ్డుకోవడానికి ప్రయత్నించవద్దని వేడుకుంటున్నామన్నారు.కష్ట కాలంలో ప్రజలకు అన్ని విధాలా సేవలందిస్తున్న వై కాపా నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.అలాగే ప్రజలకు సర్వేపల్లి రైతన్న కానుక లను అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రమేష్ రెడ్డి, టిపిగూడూరు మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#