రేపటి నుండి కరోనా నియంత్రణ నిబంధనలు అమలు-ఆర్డీవో హుస్సేన్

రేపటి నుండి కరోనా నియంత్రణ నిబంధనలు అమలు-ఆర్డీవో హుస్సేన్



న్యూస్ ఫోర్స్, నెల్లూరు:  నెల్లూరు నగరంలో కరోనా నియంత్రణ నిబంధనలు అమలు చేస్తున్నామని ప్రజలందరు సహకరించాలని ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ పేర్కొన్నారు.గురువారం స్థానిక స్టోన్ హౌస్ పేటలో నిత్యావసర హోల్ సేల్ నిర్వాహకులుతో ఆర్డీవో చర్చించారు.
ఉదయం 6గంటల నుండి9 గంటల వరకు మాత్రమే రిటైల్ అమ్మకాలు సాగించాలని,సాయంత్రం 7గంటల నుండి 10 గంటల వరకు హోల్ సేల్ అమ్మకాలు జరపాలని హుకుం జారీ చేశారు.
ఉదయం రిటైల్ షాప్ లకు 6నుండి9వరకు మాత్రమే అమ్మకాలు సాగించాలి.ప్రజలు అప్పుడు మాత్రమే బయటకు వచ్చి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు.అలాగే హోల్ సేల్ షాప్ లు వారు సాయంత్రం 7గంటల నుండి రాత్రి10 గంటల వరకు మాత్రమే అమ్మకాలు ,రిటైల్ షాప్ ల వారు కొనుగోలు లు జరుపువలెనని ఆర్డీవో ఆదేశించారు.బయట ప్రాంతాల రిటైల్ షాపుల వారికి కొనుగోలుకు సాయంత్రం ఇచ్చిన 3గంటల సమయంలోనే కొనుగోలు చేసుకుని వెళ్లాలని సూచించారు. నగరంలో వచ్చేందుకు పోలీస్ వారు అనుమతి తప్పక ఇస్తామని నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.రిటైల్, హోల్ సేల్ షాప్ ల వారికి పాసుల జారీ కూడా నగర డిఎస్పీ కార్యాలయంలో అందిస్తారని ఆయన అన్నారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ నిబంధనలు పాటించి కరోనా బారి నుండి బయట పడుదాం అని అన్నారు.షాప్ ల వద్ద సామాజిక దూరం కి మార్కింగ్ ఉండాలన్నారు.ఎవరైనా
నిత్యావసర సరుకులు అమ్మేవారు, కొనేవారు ఈ కఠిన నిబంధనలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.స్టోన్ హౌస్ పేట్ లో రేపటి నుండి సరికొత్త కోవిడ్ 19 నియంత్రణ నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రజలందరు సహకరించాలన్నారు. నవాబుపేట్ సిఐకి ట్రాఫిక్, బారికేడ్లు పై ఆర్డీవో, నగర డియస్పీలు పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎడిబుల్  ఆయిల్ డీలర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి,ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు దాసా లక్ష్మినారాయణ ,వాసవి కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు  మంచికంటి శ్రీనివాసులు,సింహపురి వాణిజ్య మండలి అధ్యక్షులు శ్రీరాం సురేష్, నవాబుపేట్ సిఐ వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#