జర్నలిస్ట్ పక్షపాతి ఆనం

జర్నలిస్ట్ పక్షపాతి ఆనం




న్యూస్ ఫోర్స్,వెంకటగిరి/నెల్లూరు:ర్నలిస్టుల పక్షపాతి అని,జర్నలిస్టులకు ఆనం కుటుంబం ఎల్లప్పుడూ తోడుంటుందని వెంకటగిరి ఆనం రామనారాయణ రెడ్డి నిరూపించుకున్నారు. ప్రపంచ మహమ్మారి కరోనా రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్న తరుణంలో నిత్యం వార్తల కోసం జర్నలిస్టుల బయట ప్రపంచంలో తిరుగుతుంటారు. వారికి రక్షణ కొరకు మాస్క్ లు,హ్యాండ్ గ్లౌజులు,శాని టైజర్ కలిపి ఆనం సేఫ్టీ కిట్ గా వెంకటగిరి జర్నలిస్టులకు,నెల్లూరు జర్నలిస్టులకు అందజేశారు.ఎవరైనా సరే తన నియోజకవర్గ పరిధిలో ఉన్న జర్నలిస్టుల, మిగతా వారికే సహాయ సహకారాలు అందిస్తారు.



కానీ ఆనం వారు అంటే తన వారు ఏ చోట ఉన్న తామున్నామంటూ ముందుకు వచ్చి వారికి సాయం అందించేవారే ఆనం రామనారాయణ రెడ్డి అని మరో సారి రుజువైంది. ఆయన నిజంగా జర్నలిస్టుల పక్షపాతి గా ముద్రపడింది.గతంలో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నపుడు ఆనం రామనారాయణ రెడ్డి మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్నపుడు నెల్లూరు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను మంజూరు చేయించి తగిన కృషి చేశారని ప్రతి ఒక్క లబ్ది పొందిన జర్నలిస్టులకు జగమెరిగిన సత్యమే.అపుడు ఇపుడు ఎప్పటికి ఆనం రామనారాయణ రెడ్డి జర్నలిస్టుల శ్రేయోభిలాషే నని చెప్పవచ్చు.#ఎస్పీన్యూస్#