సేవలో బెస్ట్.. పేదలకు అండగా యంగ్ సొసైటీ
న్యూస్ ఫోర్స్,కోవూరు: ప్రపంచ మహమ్మారి కరోనా విలయతాండవిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది.దీనితో లాక్ డౌన్ ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు ఇంట్లో నుండి బయటకు రాలేక పనులు లేక పేదలు అల్లాడిపోతున్నారు. వారికి మేమున్నాం అంటూ బెస్ట్ వన్ యంగ్ సొసైటీ మురికివాడల్లో సేవలందిస్తున్నది.వరుసగా మాసం రోజుల నుండి కోవూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో బెస్ట్ వన్ ఫౌండేషన్ సభ్యులు విస్తృతంగా తిరుగుతూ నిరుపేదలకు భోజనాలు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. కోవూరు, రాజుపాలెం, కొడవలూరు,గండవరం, పడుగుపాడు,పాటూరు ప్రాంతాల్లో పేద ప్రజలకి మజ్జిగ ,కూరగాయలు,భోజన వసతులు,అల్పాహారం, పండ్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రతిరోజు ఒక్కొక్క వెరైటీలతో పేదలకు అండగా నిలుస్తున్నారు.అలాగే ప్రజల కోసం నిరంతరం పహారా కాస్తున్న పోలీసులకు లస్సిని పంపిణీ చేసి బెస్ట్ బాయ్స్ అనిపించుకున్నారు.అంతేకాకుండా విశ్వాసంకి మారు పేరైనా గ్రామ సింహాలయిన శునకాలకు కూడా వరుసగా వాటికి ఆహారం పెడుతూ గ్రామాల ప్రజలచే ది బెస్ట్ వన్ అని ప్రశంసలందుకుం టున్నారు.అందరూ యువకులు సమూహంగా ఏర్పడి పేదలకు తాము తోడుండాలనే ఒక ఫౌండేషన్ ని ఏర్పాటు చేశారు.దీనితో విస్తృతంగా గ్రామాలలో పేదలను ఆడుకుంటూ నిరంతరాయంగా సేవలలో మునిగిన బెస్ట్ వన్ యంగ్ సొసైటీ ని పలువురు ప్రశంసిస్తున్నారు.ఇంకా మున్ముందు మరింత సేవలను అందించి నిరుపేదలకు అండగా ఉండాలని "స్టేట్ పాలిటిక్స్" కూడా కోరుతుంది.ఈకార్యక్రమంలో బెస్ట్ వన్ యంగ్ సొసైటీ అధ్యక్షుడు కళ్యాణ్ కుమార్,సభ్యులు అబ్దుల్,శ్రావణ్, ఆనంద్,సుమంత్,వంశీ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#