స్టేట్ పాలిటిక్స్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత కూరగాయలు

స్టేట్ పాలిటిక్స్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత కూరగాయలు



న్యూస్ ఫోర్స్,నెల్లూరు: కరోనా నివారణ నేపథ్యంలో
లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న
గిరిజనులకు,పేదలకు స్టేట్ పాలిటిక్స్ పత్రిక సంపాదకులు వెంపులూరు మల్లికార్జున్ సారధ్యంలో ఉచితంగా కూరగాయలను అందజేశారు.శుక్రవారం ఉదయం నగరంలోని 9వ డివిజన్ నవాబుపేట్ ,ఎఫ్ సి ఐ కాలనీ,వాటర్ ట్యాంక్ వెనుక వీధిలోని సత్య పోలేరమ్మ గుడి వద్ద గండికోట శ్రీనివాసులు సహాయ సహకారాలతో 160 మంది పేదలకు ఉచితంగా కూరగాయలను ఇంటింటికి పంపిణీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో  9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ పాల్గొని చిన బాలయ్య నగర్ వద్ద గిరిజనులకు కూరగాయలను పంపిణీ చేశారు. 



దేశ,రాష్ట్రములలోని ప్రజల ఆరోగ్యం,జీవనం కోసం కొందరు దాతలు వారికి తగిన విధంగా సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేట్ పాలిటిక్స్ పత్రిక ఆధ్వర్యంలో  ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామం అని కార్పొరేటర్ రాజశేఖర్ పత్రిక సిబ్బందిని అభినందించారు.ఇలాగే డివిజన్ లో ఉన్న దాతలు ముందుకి వచ్చి డివిజన్ లోని పేద ప్రజలకు చేయూత నివ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్టేట్ పాలిటిక్స్ పత్రిక సిబ్బంది గణేష్ కుమార్ గౌడ్,శ్రీహరి యాదవ్,శివ తేజ నాయుడు, చిన్న ,రాజేష్,గంగు రాజు ,సచివాలయ సెక్రటరీ శశి కుమార్,మహిళ కానిస్టేబుల్ శర్వాణి, వాలంటరీలు, దేవా,యువశ్రీ,లావణ్య,వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#