సొంత నిధులతో ప్రజల ఆకలి తీర్చుతున్న మంత్రి అనిల్
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సొంత నిధులు వెచ్చించి నెల్లూరు నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.స్థానిక రామ్ నగర్, మసీదు సెంటర్,బాబు గిరిజన కాలనీల లో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్ నేతృత్వంలో,10వ డివిజన్ వైసీపీ నాయకులు కొండా శివారెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా 1000మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. గడప గడపకు సచివాలయం సిబ్బంది చేతుల మీదుగా పేదలకు అందించారు.మంత్రి అనిల్ కుమార్ సొంత నిధులు ఖర్చు చేస్తూ పేదింట ఆకలి కేకలు ఉండకూడదని మంచి మనస్సుతో ఆదుకుంటున్నారని శివారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉప్పల శేషు గౌడ్ ,నాగరాజు నాయుడు ,కార్యకర్తలు గిరి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#