న్యూస్ ఫోర్స్,నెల్లూరు:కరోనా నేపథ్యంలో ఇప్పటికే సిటీ పరిధిలో ఉన్న మసీదులో పనిచేస్తున్న ఇమామ్ లకు కూరగాయలు,వెయ్యి నగదును అందజేసి వున్నారు.బుధవారం నాడు నగరంలోని10వ డివిజన్ లో ఉన్న 9 దేవాలయాలలో పని చేస్తున్న పూజారులకు వారానికి సరిపడే కూరగాయలు,వెయ్యి రూపాయల నగదును "మనసున్న మహానాయకుడు" రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్న స్వంత నిధులు వెచ్చిస్తున్నారని 10వ డివిజన్ నాయకులు కొండా శివారెడ్డి తెలిపారు.రాష్ట్రములో కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్నదని ప్రజలందరు అప్రమత్తంగా ఉండేలా సీఎం జగన్మోహన్ రెడ్డి నిత్యం చర్యలు తీసుకుంటున్నారని, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అను నిత్యం కరోనా నియంత్రణకు తన సొంత నిధులతో నియోజకవర్గ ప్రజల కోసము కొన్ని లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు.
నగరంలో లక్షల మాస్క్ లు ,శానిటైజర్స్,పేద ప్రజల కోసం కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేస్తున్నారన్నారు. 10వ డివిజన్ లోని 9 దేవాలయాల పూజరులకు కూడా కూరగాయలు, వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం అందించారన్నారు.ప్రజల కోసమే నిత్యం కష్ట పడే మనసున్న మహానాయకుడు దొరకడం నెల్లూరు ప్రజల అదృష్టమన్నారు. ప్రజలలో కూడా మంత్రి అనిల్ కుమార్ పై విశేష స్పందన వస్తున్నది.ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు నాగరాజు నాయుడు,సురేష్,సందీప్, రాజా తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#