హైకోర్టు తీర్పు హర్షణీయం -బిజెపి నాయకులు యశ్వంత్ సింగ్
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: విద్యా సంవత్సరం 2020-21 నుండి అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. బీజేపీ నాయకులు కృషికి నిదర్శనమని బీజేపీ నాయకులు యశ్వంత్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి నాయకులకు శ్రీనివాస్ ,సుదీష్ లకి కృతజ్ఞతలు చెపుతున్నామన్నారు. అలాగే ఎన్నోసార్లు భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా మాతృభాష ఎంత విశిష్టమైనదో చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ మాతృభాష చాలా గౌరవిస్తున్నారని, కానీ ఆంధ్రరాష్ట్రంలో ఆంగ్లభాషను గౌరవిస్తున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు.ఇకనైనా మొండితనంగా వెళ్లకుండా ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని కోరుతున్నామన్నారు.#ఎస్పీన్యూస్#