సెల్యూట్ టు ఇండియన్ పోలీస్ 

సెల్యూట్ టు ఇండియన్ పోలీస్ 
                   -బీజేపీ నేత యస్వంత్ సింగ్



న్యూస్ ఫోర్స్, నెల్లూరు: ఏప్రిల్ 12 న పాటియాలాలోని ఒక కూరగాయల మార్కెట్ వద్ద కర్ఫ్యూ విధులలోఉన్న పోలీస్ అధికారి పాస్ చూపించమని అడిగినందుకు ఒక బృందం పోలీసు అధికారులపై దాడి చేసి హర్జిత్ సింగ్ చేతిని కత్తితో నరికివేశారని బిజెపి రాష్ట్ర నాయకులు యస్వంత్ సింగ్ తీవ్రంగా ఖండించారు.పోలీసులపై ఇలాంటి ఘాతుకాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శస్త్రచికిత్సలో వైద్యులు అతని చేతిని తిరిగి జత చేశారన్నారు.  50 ఏళ్ల సన్ ఇన్స్పెక్టర్ అక్కడి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్  ఆసుపత్రిలో కోలుకుంటున్నారని తెలిపారు .అప్పటి అసిస్టెంట్ సన్ ఇన్స్పెక్టర్ హర్జిత్ సింగ్ తరువాత అతని ఆదర్శప్రాయమైన ధైర్యానికి గుర్తింపుగా సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారని పేర్కొన్నారు. దయచేసి హర్జీత్ పేరును ప్లకార్డ్‌లో రాయండి లేదా  మెయిన్‌బీహర్జీత్‌సింగ్' మెయిన్‌భీ ఇండియన్ పోలీస్' అని తెలియజేసే ఇతర వినూత్న పద్ధతిలో చెప్పండని ఆయన తెలిపారు. సోషల్ మీడియా లో వీడియోను పోస్ట్ చేసి మీ ఫేస్‌బుక్ పేజీ / ట్విట్టర్ ఖాతా / ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అప్‌లోడ్ చేయాలని ప్రతి ఒక్క భారతీయులను కోరుతున్నామన్నారు.అనంతరం జయహో హర్జీత్ సింగ్ అంటూ నినాదాలు చేసారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్ ,నాగ మోహన్, క్రాంతి ,మణీ పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#