ఆగని రైతుల దాతృత్వం.. సర్వేపల్లి రైతన్న కానుక జోష్
◆వేల పుట్లు రైతుల విరాళాలు
★ప్రజల్లో ఆనందం..శభాష్ అనిపించుకుంటున్న కాకాణి
◆రాష్ట్రములో సరికొత్త పంథా కి తెర.పలువురికి మార్గదర్శిగా..!
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:సర్వేపల్లి నియోజకవర్గంలో రైతుల దాతృత్వం ఆగలేదు.రోజు రోజు కు పెరుగుతూనే వెల్లువలా వేల పుట్లను సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి కి అందజేస్తున్నారు. ప్రజల్లో కాకాణి చేస్తున్న సేవలకు వారి ఆనందం అవధుల్లేనిది శభాష్ కాకాణి అంటూ పలువురు ఆయనని అభినందిస్తున్నారు.నమ్ముకున్న ప్రజలకోసం నిస్వార్థంగా వారికి కష్టాల్లో తనకెందుకులే అనుకోకుండా నేనున్నానంటూ భరోసానివ్వడమే కాదు వారికి అండగా నిలుస్తున్నారు.రైతుల దాతృత్వం వెరసి కొందరు దాతల విరాళాలతో సర్వేపల్లి ప్రజల గడప ముందుకే నిత్యావసర వస్తువులు పంపిణి కార్యక్రమం చేపట్టారు.ఆకలి అన్న వారికి అన్నం పెట్టవయ్య.. నీకు నేను ఇస్తాను అన్న భగవాన్ గొలగముడి వెంకయ్య స్వామి మాటలును సర్వేపల్లి నియోజకవర్గంలో ఆచరణలో పెడుతున్నారు ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గ పరిధిలోనే భగవాన్ వెంకయ్య స్వామి పుణ్యక్షేత్రం వెంకటాచల మండలంలో ఉంది.లక్షల్లో ధాన్యం రైతులు దానం చేస్తూ ఆ నియోజకవర్గ ప్రజలకు ఆత్మీయ బంధువులుగా మారిపోయారు.అలనాటి రాయుల కాలంలో ప్రజలు ఏకష్టాలు లేకుండా ఉన్నారనేది పుస్తకంలో చదివాము.ఇపుడు కల్లారా సర్వేపల్లి నియోజకవర్గంలో చూస్తున్నాం.ప్రజా రంజిత పాలన చేసినప్పుడే ప్రజలు ఆప్రాంతంలో సంతోషంగా ఉంటారన్నది కాకాణి సేవలే నిదర్శనం.
.స్వచ్ఛందగానే రైతులు, దాతలు ముందుకొచ్చి తమకు తగిన రీతిలో విరాళాలు అందజేస్తూ రాష్ట్రములో ఉన్నవారికి సర్వేపల్లి రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రారంభ దశ నుండి ఈనాటి వరకు తిరుగు లేకుండా రోజు రోజు కు ధాన్యం బస్తాలు పుట్లు పుట్లు విరాళాలు అందిస్తున్నారు రైతులు.ఆ నియోజకవర్గ రైతుల సహకారమే ఆ శాసన సభ్యుడు సంకల్పానికి శర వేగంగా దూసుకెళుతూ ప్రజల కోసమే తన జీవన ప్రయాణం లా సాగిపోతున్నారు.వీరు చేస్తున్న సేవలకు కొత్తగా వచ్చిన కరోనా వైరస్ కూడా అక్కడి నుండి పారిపోయేట్లు గా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందస్తు చర్యలును ఎమ్మెల్యే కాకాణి తీసుకుంటున్నారు.రాష్ట్రంలోనే గొప్ప సేవా దృక్పథం కలిగిన మనసున్న మా ఊరు ఎమ్మెల్యే గా కాకాణి గోవర్ధన్ రెడ్డి నిలిచిపోయారు.ప్రభుత్వం పై ఆధారపడకుండానే స్వచ్ఛందంగా ధాన్యాన్ని సేకరిస్తూ దాతల సహకారంతో "సర్వేపల్లి రైతన్న కానుక" కొత్త పంథాకి తెరలేపి,ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి నిరుపేదకు అండగా నిలిచారనడంలోఅతి శయోక్తిలేదు.ప్రజలకు సేవ అంటే మాటలకే పరిమితం కాకుండా చేతల్లోనే చూపిస్తూ ఎమ్మెల్యే అంటే నాయకుడు కాదు ఆ నియోజకవర్గ సేవకుడిగా ప్రజల మనసుల్లో ముద్రవేసుకున్నారు కాకాణి.#ఎస్పీన్యూస్#