9వ డివిజన్ లో 700మంది పేదలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ చేయూతతో 700మంది పేదలకు ఉచితంగా కూరగాయలును పంపిణీ చేశారు.స్థానిక 9వ డివిజన్ లో కుసుమ హరిజనవాడ,నవాబుపేట్ మెయిన్ రోడ్ ప్రాంతాల్లో నిరుపేదలకి వారానికి సరిపడే కూరగాయలను గడప గడప ముంగిటకెళ్లి ఉచితంగా డివిజన్ మాజీ కార్పొరేటర్ ,మనసున్న మా రాజుశేఖరుడు అందజేశారు. పేదలను ఆదుకునే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని, కష్టాలలో ఉన్న ప్రజలకు బాసటగా నిలిచే మంత్రి అనిల్ అన్న అని కార్పొరేటర్ రాజశేఖర్ తెలిపారు.9వ డివిజన్ లో ఎక్కువ శాతం నిరుపేదలు ఉన్నారని వారందరిని ఆదుకునేందుకు డివిజన్ లో ఉన్న దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వాలంటరీలు అనిల్, మోహన్ దాస్, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#