700పిపిఈ కిట్లను మంత్రి అనిల్ కి అందజేత
న్యూస్ ఫోర్స్, నెల్లూరు:కరోనా నియంత్రణలో భాగంగా నెల్లూరు నగరంలోని కిమ్స్ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ కి పిపిఇ కిట్లను అందజేశారు.నగరంలోని ఇస్కాన్ సిటీ నందు గల మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ ని కలిసి 700 పి.పి.ఇ. కిట్ లను అందించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నెల్లూరు రూరల్ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వై.ఎస్.ఆర్.సి.పి. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పి. రూప్ కుమార్ యాదవ్, డాక్టర్ వి.జగదీశ్, తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#