ఏపీఆర్ హెల్పింగ్ హాండ్స్   ₹50వేల వితరణ

 ఏపీఆర్ హెల్పింగ్ హాండ్స్ 
 ₹50వేల వితరణ



న్యూస్ ఫోర్స్,నెల్లూరు: నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ ఆర్ హెల్పింగ్ హాండ్స్ సంస్థ 50 వేల రూపాయల వితరణ చేసింది. ఏపీఆర్ హెల్పింగ్ హాండ్స్ చైర్మెన్ నిజాముద్దీన్ శనివారం 50 వేల రూపాయల చెక్కును జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎన్. రాజ్యలక్ష్మికి  అందజేశారు. దీనితో పాటుఎన్- 95 మాస్కులు, సర్జికల్ మాస్కులు కూడా అందజేశారు. ఏపీఆర్  హెల్పింగ్ హాండ్స్ సంస్థ తరఫున ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ చేయూత ఇవ్వడమే లక్ష్యమని ఆ సంస్థ చైర్మన్ నిజాముద్దీన్ తెలిపారు. ఈ కష్టకాలంలో అందరూ ఏకమై కరోనా మహమ్మారిపై గెలవాలన్నది నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎన్. రాజ్యలక్ష్మి ఈ సందర్భంగా తమని అభినందించారని ఆయన తెలిపారు.#ఎస్పీన్యూస్#