నవాబుపేట్ వ్యవసాయ మార్కెట్ ని మంత్రి పరిశీలన
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: నగరంలోని నవాబుపేటలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డును మంగళవారం ఉదయం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి పండ్ల వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్ ,9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#