కోవిడ్ 19 వ్యాప్తి నిరోధానికి 105 కోట్లు ఇచ్చిన రోటరీ ఇండియా
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: రోటరీ ఇంటర్నేషనల్ సంస్థకు 2020- 2021 సంవత్సరంకు కాబోయే అధ్యక్షుడైన శేఖర్ మెహత ఇచ్చిన సమాచారం ప్రకారం భారతదేశము నందు కోవిడ్ 19 వ్యాప్తి నిరోధానికి 105 కోట్ల రూపాయలు రోటరీ ఇండియా ఖర్చు చేయడం జరిగిందని రోటరీ క్లబ్ నెల్లూరు సౌత్ అధ్యక్షుడు ఎం. సతీష్ కుమార్ తెలియ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఇందులో 30 కోట్ల రూపాయలను పి.ఎం రిలీఫ్ ఫండుకు అందజేయడం జరిగిందన్నారు. మిగతా 75 కోట్లను వివిధ ఎక్విప్మెంట్ లు అనగా మాస్కులు,పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్స్ , శానిటైజర్లు మరియు ముడి సరుకుల కోసం ఖర్చు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మొత్తంమీద 105 కోట్ల రూపాయలను రోటరీ ఇండియా ఖర్చు పెట్టడం జరిగిందని తెలియజేశారు. అంతేకాకుండా నెల్లూరు నందు మరియు ఇండియా మొత్తం రోటరీ క్లబ్ లు లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రజలకు రకరకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలియజేశారు . ఈ సహాయ సహకారాలు అందించిన క్లబ్ మెంబర్స్కు స్నేహితులకు ,కృతజ్ఞతలు తెలిపారు.#ఎస్పీన్యూస్#