130మంది కుటుంబాలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ

130మంది కుటుంబాలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ



న్యూస్ ఫోర్స్,నెల్లూరు:రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలతో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్ నేతృత్వంలో 130మంది కుటుంబాలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.నగరంలోని10వ డివిజన్ రామచంద్రాపురంలో డివిజన్ నాయకులు కొండా శివారెడ్డి ఆధ్వర్యంలో గురువారం 130మంది నిరుపేద కుటుంబాలకు ఉచితంగా కూరగాయలును ఇంటింటికి పంచి పెట్టారు.ఈ కార్యక్రమానికి గండికోట శ్రీనివాసులు సహాయ సహకారాలు అందించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెంకటేశ్వర్లు యాదవ్,కార్యకర్తలు సురేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#